ఆళ్లగడ్డ
13 లక్షల 50 వేలు చెక్కును సీఎంకు అందజేసిన ఎమ్మెల్యే భూమా
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ భూమా ట్రస్టు తరపున రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన విషయం విధితమే. 5 లక్షల చెక్కుతోపాటు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పిలుపు మేరకు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల టీడిపి నాయకులు అందించిన ఎనిమిది లక్షల 50వేల ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రకటించిన ఐదు లక్షల కలిపి 13 లక్షల 50 వేల చెక్కును శుక్రవారం విజయవాడ శుక్రవారం సీఎంకు అందజేశారు