పెనుమంట్ర: రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్
మండల కేంద్రమైన పెనుమంట్ర గ్రామ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ.. రేషన్ షాప్ వద్ద సరకులు సక్రమంగా సరఫరా చేయాలని, రోజూ సరకుల వివరాలు పొందుపర్చాలన్నారు. జనవరి నెల రేషన్ పంపిణీలో కందిపప్పు, పంచదార కూడా సరఫరా చేయాలని సూచించారు.