విశాఖ: క్యారమ్స్ విజేతకు అభినందనలు
విశాఖ నగరానికి చెందిన అఖిల భారత క్యారమ్స్ పురుషుల సింగిల్స్ విజేత జనార్ధనరెడ్డిని ఆదివారం విఎంఆర్డిఎ ఛైర్మన్ మానం ప్రణవ గోపాల్ అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తా మన్నారు. ఇంకా జనార్ధన రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి విశాఖకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.