గుర్ల: గుర్లలో డయారియాకు కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే
గుర్ల మండలంలో ఇటీవల డయేరియా రావడానికి కారణం గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శనివారం ఆయన చీపురుపల్లి లో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం గుర్ల లో పర్యటించిన వైయస్ జగన్ నిజ నిర్ధారణ లేకుండా అవాకులు చవాకులు ప్రభుత్వంపై మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే తప్పించి శవ రాజకీయాలు చేయకూడదని అన్నారు.