

పురిటిపెంట ఆశీల వేలం పాట
గజపతినగరం మండలంలోని పురిటిపెంట రోజువారి ఆశీలు వేలంపాట నిర్వహించారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేలంపాట జరిపారు. ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు నిర్ణయించగా సాసుబిల్లి అప్పలనాయుడు 2,20,100 రూపాయలకు పాడడంతో ఖరారు చేస్తున్నట్లు ఈఓపిఆర్డి సుగుణాకరరావు ప్రకటించారు. ఈ పాటలో ఆరుగురు పాల్గొన్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.