జీవో నెం. 115 రద్దు చేయాలని ధర్నా
జీవో నెంబర్ 115 ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం, రావాడరామభ్రద్రపురం పీహెచ్సీలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, వైద్యులు, వైద్య సిబ్బంది కురుపాం హాస్పిటల్ ముందు గురువారం ధర్నా నిర్వహించారు. తాము ఎంతోకాలంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నామని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తపరిచారు.