లక్కవరపుకోట: గురువారం ఎమ్మెల్యే లలిత కుమారి షెడ్యూల్ ఇదే
ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం షెడ్యూల్ ను ఎల్ కోట ఆమె క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎల్ కోట ఆమె స్వగృహంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో జరగనున్న సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.