ఆకివీడు డైలీ మార్కెట్ లో ఆక్రమణలు తొలగింపు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు డైలీ మార్కెట్ లో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం ఆదివారం మొదలైంది. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదేశాలతో నగర పంచాయతీ అధికారులు మరియు సిబ్బంది రహదారి పైకి ఏర్పాటు చేసిన దుకాణాలను మరియు రేకులను స్వచ్ఛందంగా తొలగించారు. అలాగే నగర పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.