ఒంగోలులో కాకరేపుతున్న బాలినేని ఎంట్రీ
ఒంగోలులో బాలినేని ఎంట్రీ కాకరేపుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసి ఫ్లెక్సీలను తొలగించారు. కావాలంటే జనసేన నేతల ఫొటోలు వేసుకోవాలని ఫైర్ అయ్యారు. వచ్చే నెల 4న ఒంగోలులో భారీ బహిరంగ సభ పెట్టి పవన్ సమక్షంలో చేరనున్నారు.