ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే పెన్షన్లు పెంచాం: ఎమ్మెల్యే
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు కందుకూరు టౌన్ 14, 15 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పర్యటించారు. గత వంద రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్లు పెంచామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.