17 టీఎంసీలకు చేరిన రాళ్లపాడు ప్రాజెక్టు నీటిమట్టం
లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 17 టీఎంసీల నీరు ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రాళ్లపాడు పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరిన తర్వాత గేట్లు తెరిచి నీరు క్రింది వైపుకు విడుదల చేయు సందర్భంలో మన్నేరు పరివాహక ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని ఇటీవల ప్రాజెక్టు సందర్శనలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.