ఆదోని: నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోలు నిలుపుదల
ఆదోని పట్టణంలోని ఆయా ఫ్యాక్టరీల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు పత్తి కొనుగోలు నిలుపుదల చేస్తున్నట్లు సీసీఐ ఇన్చార్జ్ లు భరత్, గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ పత్తి నిల్వలు ఎక్కువగా ఉండడంతో మూడు రోజులపాటు తాత్కాలికంగా కొనుగోలు నిలుపుదల చేస్తున్నామని తెలియజేశారు. పత్తి దిగుబడుల రైతులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.