ఆదోని: డీలర్ల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం జరిగిన రేషన్ డీలర్ల రాత పరీక్షా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడారు. 78 చౌకధరల దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన డీలర్లను నియమించేందుకు డిసెంబర్ 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. 512 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 472 దరఖాస్తులను అంగీకరించగా, 40 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు.