ఆదోని: హామీలను నెరవేర్చలేని బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాటలో పార్టీ నేతల కదం తొక్కారు. విద్యుత్ డివిజన్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఎమ్మెల్సీ మధుసూదన్, పార్టీ నేతలు గోపాల్ రెడ్డి, నాగరాజ్ పాల్గొన్నారు.