కర్నూలు: 20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
కర్నూలు జిల్లాలో గురువారం 20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. ఆదోని రెవెన్యూ డివిజన్ లోని పెద్దమర్రివీడులో 19, జోహారపురం 01, కందనాతి 19, సజ్జలగూడెం 08, పోడలకుంట 07, బసాపురం 03, కపటి 08, హోళగుంద 51, మదిరి గ్రామం 02 మొత్తము 20 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 318 అర్జీలను అధికారులు స్వీకరించారు.