కర్నూలు : ఏకంగా ఎనిమిది మందిపై హత్య కేసు
ఆదోని మండలంలోని చాగిలో కురువ మల్లమ్మ అనే అవివాహితపై దాడి చేసి ఆమె మృతికి కారణమైన 8 మందిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇస్వీ ఎస్సై నాగేంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీన చాగి గ్రామంలో ఇంటి పక్కన డ్రైనేజీ కాలువ విషయంలో గొడవ పడి కురువ మల్లమ్మపై అయ్యప్పరెడ్డి, లక్ష్మితో పాటు మరో ఆరుగురు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. కర్నూలు ఆస్పత్రి చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందింది.