తాడిపత్రిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
తాడిపత్రి పట్టణంలో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమయింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో దాదాపు 70 ఏళ్ల వయస్సు గల ఓ వృద్ధుడు మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని, ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.