ఉరవకొండ: తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించిన మహిళలు
విడపనకల్లు మండల కేంద్రంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. గత పది రోజులుగా కొళాయిలకు నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 42వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో గురువారం బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు.