కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్.ఎల్. నాయుడు అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం కోటపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లమ్మత చక్రవర్తి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.