వీరఘట్టం: అనర్హుల పింఛన్ల పై విచారణ చేపట్టాలి
వీరఘట్టం మండలం వండవ గ్రామంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఆ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బి. వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అనర్హుల పింఛన్ల విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ.. సమస్యను పరిశీలిస్తానన్నారు.