ఘనంగా సంపూర్ణత అభియాన్
భామిని మండల హెడ్ క్వార్టర్లో ఉన్న స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మంగళవారం పార్వతీపురం - మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ మరియు భామిని మండల వైసీపీ అధ్యక్షుడు, ఎంపీపీ ప్రతినిధి తోట సింహాచలం ఆధ్వర్యంలో 'సంపూర్ణత అభియాన్' కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ప్రతి ఒక్కరూ పరిశీలించాలని అన్నారు.