

వడమాలపేట: జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గం, వడమాలపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం జడ్పీటీసీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.