నగిరి: కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబర కుప్పంలో వీవర్స్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు.