ఏలూరును అతిపెద్ద పారిశ్రామికవాడగా తీర్చిదిద్దటమే లక్ష్యం
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అతిపెద్ద పారిశ్రామికవాడగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. బెంగళూరుకు చెందిన హార్టి గ్రీన్ ఫుడ్స్ థాయిలాండ్ లిమిటెడ్ ప్రతినిధులు సుగుణప్రియ వెల్లంకి, బాబీ పటేల్ ఎంపీను బుధవారం కలిశారు. ఏలూరు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా ఉన్నందున తమకు సహకరించాలని కోరారు.