ముత్యాలపల్లి: డి-నమూనా భూముల సమస్య పరిష్కరిస్తాం: తహసిల్దార్ రాజ్ కిషోర్
ముత్యాలపల్లి గ్రామంలో దీర్ఘకాలికంగా నెలకొన్న భూముల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మొగల్తూరు మండల తహసిల్దార్ కే.రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో నిర్వహించిన జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలు సత్వరము పరిష్కరించేందుకు సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.