పలమనేరు రూరల్ మండలంలోని సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మూడు సమావేశాల్లో పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసినా కావాలని వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎంపీడీఓ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.