పీలేరులో ఏనుగులు దాడి చేసిన ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే
పీలేరు మండలం బండారు బండ్లపల్లి వద్ద ఏనుగుల గుంపు సంచరించిన ప్రాంతాన్ని మంగళవారం శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఏనుగుల దాడిలో మృతి చెందిన చిన్న రాజారెడ్డి కుటుంబీకులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. అటవీశాఖ అధికారులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏనుగుల సంచారం పై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.