తిరుపతి: మహా కుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం
జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూన ఆలయాన్ని నాగవాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్-6 వద్ద ఆదివారం ప్రారంభించింది. టీటీడీ నమూన ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు టీటీడీ నమూన ఆలయాన్ని ఏర్పాటు చేసింది.