పార్వతీపురం: పెద పెంకిలో బోధ వ్యాధి వ్యాప్తిని అరికట్టండి
మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్ద పెంకిలో బోధ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించడానికి విచ్చేసిన ఆయన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లతోను, అధికారులతోను సమీక్షించారు. బోధవ్యాధి వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, ఇతర ఆరోగ్య పరిస్థితులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.