వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెంలోని దివంగత నేత వైయస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్దరాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేస్తుండగా విగ్రహ ధ్వంసం విషయం బయటపడింది. దీంతో సంఘటన స్థలానికి వైసీపీ నేత కేకే రాజు వెళ్లారు. ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.