టిక్కెట్ల నగదు చెల్లింపుకు ప్రత్యేక కౌంటర్లు
తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహిస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికుల టికెట్లపై నగదు రిఫండ్ చేయడానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే రద్దైన రైళ్లకు లకు సంబంధించి సమాచారాన్ని తెలియజేసేందుకు విశాఖ, విజయవాడలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.