విశాఖ బీచ్ రోడ్ లో తీవ్ర రద్దీ
విశాఖ బీచ్ రోడ్ లో శనివారం తీవ్ర రద్దీ నెలకొంది. దసరా కావడంతో భారీ స్థాయిలో పర్యటకులు ఆర్కే బీచ్ కి తరలివచ్చారు. దీంతో బీచ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. గంటల కొద్దీ ట్రాఫిక్ లో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేస్తున్నారు.