ఆదానితో జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం చోడవరం సూపర్ బజార్ జంక్షన్లో సిపిఐ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ అమెరికాలో న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో అవినీతి కేసు నమోదయిందనీ, విద్యుత్ ఒప్పందాలు కోసం దాదాపు 2100 కోట్ల రూపాయలు మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అద్దాని లంచాలుగా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.