పసుపు పంట సాగుకు పెట్టుబడి పెట్టాల్సిందే
పసుపు పంట సాగు చేసే రైతులు విత్తనాలు నాటడం మొదలు పంట అమ్ముకునే వరకు చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పసుపు భూమిలో నుంచి తీసే సమయంలోనే తల్లి, పిల్ల కొమ్ములని వేరు చేస్తారు. వీటిని గోల, కాది అనే పేర్లతో పిలుస్తారు. గోల అంటే తల్లి కొమ్ము, కాది అంటే పిల్ల కొమ్ము అని అర్ధం. భూమిలో నుంచి తీసిన పసుపు కొమ్ములు వారంలో ఉడకపెట్టాలి. పసుపు కొమ్ములని ఉడకపెట్టడం ఆలస్యం అయితే నాణ్యత రోజు రోజుకి తగ్గుతుంది.