TG: 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు పరిపాలన అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.338 కోట్లతో కాలేజీలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.