ఆదిలాబాద్
ఆదిలాబాద్: మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్ గా సివిఎన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గతంలో ఆయన నిర్మల్ బల్దియా కమిషనర్ గా పనిచేశారు. బదిలీలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా వచ్చారు. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కమిషనర్ రాజు తెలిపారు.