మహబూబ్ నగర్: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ అరుణ
అమృత్ భారత్-2 పథకం కింద రూ. 4. 5 కోట్ల నిధులతో కొడంగల్ లో చేపట్టిన అభివృద్ధి పనులకు మంగళవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కోస్గి మున్సిపాలిటీలో రూ. 12. 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల నాయకులు, కాడా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.