మహబూబ్ నగర్: వివాహిత మహిళ అదృశ్యం
ఓ వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్ వివరాల ప్రకారం. హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల చెన్నమ్మ (30) ఈ నెల 17న పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలు తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.