జగిత్యాల: బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వకు రూ 25000 జరిమాన
వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంగించారని ఓ ఎన్జివో సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ, మై విలేజ్ షో సభ్యుడు రాజులపై బుధవారం కేసు నమోదు చేసి రూ 25000 జరిమాన విధించినట్టు జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి పద్మారావు తెలిపారు. 20 మే, 2022 లో చిలక పంచాంగం అనే అంశంపై కామెడీ షో చిత్రీకరించి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారని, ఇందులో చిలకను బంధించినట్టు ఉందని ఫిర్యాదు అందిందన్నారు.