మరో ఎన్నికకు సిద్ధమైన ఉత్తర తెలంగాణ!
త్వరలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది. దీంతో అక్కడ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారనున్నాయి. ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు తలపించునున్నాయి.