టీ పొడికి బదులు పురుగుల మందు.. దంపతులు మృతి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియంలో విషాద ఘటన జరిగింది. వృద్ధాప్యం వల్ల అప్పాయమ్మ (70)కు కంటి చూపు మందగించింది. టీ తయారు చేసే క్రమంలో టీపొడికి బదులు పొరపాటుగా పురుగుల మందు వేసింది. తర్వాత భర్త వెలచూరి గోవింద్ (75)కు ఇచ్చి తాను కూడా టీ తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు చనిపోయారు.