మహబూబ్ నగర్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు శుక్రవారం ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ వెల్లడించారు. నారాయణపేటకు చెందిన చేతన్ కౌశిక్ రెడ్డి అనే యువకుడికి అరుదైన శస్త చికిత్స చేసామన్నారు. స్వర పేటిక వద్ద ఉన్న ట్యూమర్ ను తొలగించినట్లు డా. సంపత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటువంటి చికిత్స చేయడం ఇదే మొదటిసారి అన్నారు.