కూతురి ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా
TG: హైదరాబాద్ మల్కాజ్గిరిలో కూతురు మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. రెండేళ్లుగా కూతురి చుట్టూ తిరిగి విసిగొచ్చిందని.. అందుకే తాము ఇలా ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగామని వారు చెబుతున్నారు. తాము రెండేళ్ల క్రితం ఊరెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. దీంతో ఈ పంచాయితీ పోలీసుల దగ్గరకు చేరింది.