మంచిర్యాల
"తాగునీరును సరఫరా చేయండి"
మందమరి పట్టణం క్యాతంపల్లి భరత్ నగర్ కాలనీ ఏడవ వార్డ్ లో తాగునీటి పైపులైన్ వేసి దాదాపుగా నాలుగు సంవత్సరాల పైనే అయింది. కాగా ఇప్పటివరకు తాగునీరు రావడంలేదని స్థానికులు వాపోయారు. ఈ సమస్య గురించి సంబంధించిన అధికారులకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా సమస్య అలాగే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్య పై చర్యలు తీసుకొని మా కాలనీకి తాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.