మంచిర్యాల
టీయుసీఐలో ఐఎఫ్టీయూ విలీన సభ పోస్టర్లు విడుదల
దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టీయుసీఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా)లో ఐఎఫ్టీయూ విలీనం కాబోతున్నట్లు యూనియన్ రాష్ట్ర నాయకులు తోకల రమేష్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 20న హైదారాబాద్ లో జరిగే విలీన సభ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ టీయుసీఐ నాయకత్వంతో గత ఏడాది కాలంగా చర్చించి ఉమ్మడి ప్రణాళికను ఆమోదించినట్లు పేర్కొన్నారు.