కోదాడ: విద్యారంగ సమస్యలపై ప్రశ్నించే గొంతుక
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రశ్నించే గొంతుక నర్సిరెడ్డి అని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పాండురంగ చారి అన్నారు. బుధవారం కోదాడ మండలంలోని గుడిబండ, ఎర్రవరం గ్రామాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ గడపగడపకు ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల బాధ్యులు మైసయ్య, శ్రీనివాసరావు ఉన్నారు.