పట్టాలు తప్పిన గూడ్స్ రైలు నుంచి డబ్బాలతో డీజిల్ ఎత్తుకెళ్లిన స్థానికులు (వీడియో)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ అనే పట్టణం సమీపంలో పట్టాలు తప్పిప గూడ్స్ వ్యాగన్ల నుంచి డీజిల్‌ను డబ్బాలు, బకెట్లు, పీపాలు, చిన్న చిన్న డ్రమ్ములతో అక్కడి స్థానికులు ఎత్తుకుపోయారు. డీజిల్ లోడ్‌తో ఢిల్లీ-ముంబై మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు మూడు వ్యాగన్లు గురువారం రాత్రి పట్టాలు తప్పాయి. దీంతో సమీపంలోని గ్రామస్థులు.. రైల్వే అధికారులు వారించినా వినకుండా వ్యాగన్ల నుంచి డీజిల్‌ను ఎత్తుకెళ్లారు.