గద్వాల్
పుష్కర ఘాట్ వద్ద మహిళా శవం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల సమీపంలో ఉన్న తుంగభద్ర నది పుష్కర ఘాట్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ శవం శనివారం లభ్యమయింది. మృతి చెందిన మహిళ ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన హారిక గా పోలీసులు గుర్తించారు. దీనిపై అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.