మద్దెల చెరువు: ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామంలో గురువారం పిట్లం మండల పశు వైద్య అధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దెల చెరువు గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని నిర్వహించినట్లు, ఈ శిబిరంలో 50 పశువులకు వైద్య పరీక్షలు అందించి, మందులను పంపిణీ చేశామని తెలిపారు.