నాంపల్లి: బాణసంచా దుకాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరి
నాంపల్లి: బాణసంచా విక్రయదారులు జీహెచ్ఎంసీ నుంచి తప్పనిసరిగా తాత్కాలిక అనుమతి (టెంపరరీ ట్రేడ్ లైసెన్స్) తీసుకోవాలని కమిషనర్ ఇలంబర్తి శుక్రవారం సూచించారు. లైసెన్స్ లేకుండా దుకాణాలను ఏర్పాటు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం పౌర సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ వైబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జనావాసాల మధ్య, ఫుట్పాత్లపైన దుకాణాలు ఏర్పాటు చేయవద్దని అన్నారు.